prajaseema.com
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:50 pm Digital Edition : PRAJA SEEMA

తండ్రి కార్మికుల బ్రతుకుల కోసం పోరాటం – కూతురు దేశ భవిష్యత్తు కోసం పోరాటం దాసరి వర్ష

తండ్రి కార్మికుల బ్రతుకుల కోసం పోరాటం – కూతురు దేశ భవిష్యత్తు కోసం పోరాటం దాసరి వర్ష

 

రైల్వేకోడూరు ప్రజాసేమ

కామ్రేడ్ దాసరి జయచంద్ర కుమార్తె డా. దాసరి వర్ష ఎంబిబిఎస్ సీటు సాధించి కార్మిక కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది

తిరుపతి జిల్లా, రాఘవరాజపురం చెందిన ప్రముఖ కార్మిక నాయకుడు, ఏఐటీయూసీ రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దాసరి జయచంద్ర – పైనం విష్ణు శివ జ్యోతి దంపతుల కుమార్తె డా. దాసరి వర్ష ఎంబిబిఎస్ సీటు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

విద్యా వివరాలు:* దాసరి వర్ష 10వ తరగతిలో 600 కు 591, ఇంటర్మీడియట్ లో 1000 కు 985 మార్కులు సాధించి, NEET-2026 లో 452 మార్కులు, AIR 162981 తో – విశ్వభారతి మెడికల్ కాలేజ్, కర్నూలు ( డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ) లో MBBS సీటును ఫేజ్-1 కౌన్సిలింగ్ లో 02-09-2026 న సాధించింది. ఈ నెల 15 నుండి క్లాసులు ప్రారంభం.

 

ఈ సందర్భంగా కామ్రేడ్ దాసరి జయచంద్ర మాట్లాడుతూ “నేను కార్మికుల జీతభత్యాల కోసం, వారి హక్కుల కోసం రోడ్డు మీద పోరాటం చేస్తుంటే, నా కుమార్తె డా. దాసరి వర్ష దేశ భవిష్యత్తు అయిన ప్రజల ఆరోగ్యం కోసం, పేద ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్ గా సేవ చేయడానికి సిద్ధమైంది. ఇది మా కార్మిక కుటుంబానికి మాత్రమే కాదు, యావత్ కార్మిక వర్గానికి గర్వకారణం!” అని తెలిపారు.

 

“అలాగే ఈ విజయం వెనుక నిలిచిన విచ్ డం హై స్కూల్/ సి బి ఎస్ ఈ రైల్వే కోడూరు ఉపాధ్యాయులకు, పాఠశాల యాజమాన్యానికి, ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ విద్యను అందించిన అశ్వమేధ కళాశాల తిరుపతి అధ్యాపక బృందానికి, కళాశాల యాజమాన్యానికి మా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గురువుల రుణం తీర్చుకోలేనిది. వారి క్రమశిక్షణ, ప్రోత్సాహమే ఈ రోజు నా బిడ్డను డాక్టర్ ని చేసింది” అని అన్నారు