సిద్ధవటం ప్రజా సీమ
కడప జిల్లా డిసిసిబి చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్ధవటం మండల సింగల్ విండో చైర్మన్ దారపునేని దశరథ రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలబడడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. సిద్ధవటం మండల సొసైటీ అభివృద్ధిపై సమావేశంలో చర్చించామని అన్నారు. అతి త్వరలో అన్ని పీఏసీలకు మంచి రోజులు రానున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అందరు పిఎసి చైర్మన్లు పాల్గొన్నారు.