prajaseema.com
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 5:17 pm Digital Edition : PRAJA SEEMA

డంపింగ్ యార్డ్ చెత్తను నిత్యం కాలుస్తూ ఉండడంవల్ల రైల్వేకోడూరులో కాలుష్యం 

డంపింగ్ యార్డ్ చెత్తను నిత్యం కాలుస్తూ ఉండడంవల్ల రైల్వేకోడూరులో కాలుష్యం

రైల్వేకోడూరు  న్యూస్

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం లో హరిశ్చంద్ర స్మశాన వాటిక రైల్వే రైల్వే కోడూరు పట్టణ ప్రజలకు ఉండే ఏకైక ఆధారం. ప్రముఖులను సైతం వారి అంతక్రియలు ఇక్కడే నిర్వహించారు… అలాంటి స్మశాన వాటికకు ఆనుకొని ఉన్న ఒక డంపింగ్ యార్డ్ గా దాదాపు 20 సంవత్సరాల నుండి మలిచి, గుంజినేయరు పూర్తిగా చెత్తా చెదారంతో కప్పేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మకు ఎంతో ఆవేదన కలుగుతుందని మరియు డంపింగ్ యార్డ్ చెత్తను నిత్యం కాలుస్తూ ఉండడంవల్ల రైల్వే కోడూరు ప్రాంతం మొత్తం కాలుష్యంతో నిండిపోయి ప్రమాదకరమైన రోగాల భారీ పడి జనాలు మరణిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి సయ్యద్ అహ్మద్ తో చెప్పి ప్రజలు వాపోయారు…. ముఖ్యంగా డంపింగ్ యాడ్ ద్వారా నష్టపోతున్న గుర్రప్పాలెం ప్రజలు, శాంతినగర్ ప్రజలు, నరసరావుపేట ప్రజలు సయ్యద్ అహ్మద్ గారికి ఫోన్ చేసి వారి బాధలు తెలియజేసి అధికారులకు వారి సమస్యను చేరవేసి వారి ప్రాణ రక్ష చేయాలని నివేదించారు… సయ్యద్ అహ్మద్ గారు ఈ సందర్భంగా ఇది మొత్తం రైల్వే కోడూరు యొక్క చాలా పెద్ద సమస్య. ఇది పరిష్కారమయ్యే వరకు అధికారుల దృష్టికి తీసుకు వెళ్తూ ఉంటామని, పరిష్కారం చెయ్యకపోతే టెంట్ వేసి అక్కడే నిరాహార దీక్షకు కూర్చుంటామని హామీ ఇచ్చారు.