టిప్పర్ బ్యాటరీల చోరీ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
రైల్వేకోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోటిప్పర్ బ్యాటరీల చోరీ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్, రెండు బ్యాటరీలు స్వాధీనం. రైల్వేకోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 169/2026, యు /ఎస్ 303(2) బి ఎన్ ఎస్ కేసును పోలీసులు ఛేదించారు. చౌడేశ్వరి ఢాబా సమీపంలో నిందితులు మెండ్రగుట్టి దుర్గాప్రసాద్ (22), మెండ్రగుట్టి శివకృష్ణ (19), రాగల శివకుమార్ (33) లను అరెస్ట్ చేశారు. వారి నుండి రూ.20,000 విలువైన రెండు టిప్పర్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మిగిలిన చోరీ సొత్తు స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.