జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలలో విజ్ డమ్ విద్యార్థుల అసమాన ప్రతిభ
రైల్వే కోడూరు ప్రజాసీమ
సెప్టెంబర్ 5 వ తేదీ మరియు 6 వ తేదీన గోవాలోని రోలర్ రిలే స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ లెవల్ స్కేటింగ్ పోటీలలో రైల్వేకోడూరు, గాంధీనగర్ నందలి విజ్‌డమ్ CBSE స్కూల్ విద్యార్థులు M. పునీత్ రామ్ (అండర్-10 విభాగం), M. రహమతుల్లా (అండర్-12 విభాగం) నేషనల్ లెవల్‌లో ప్రథమ స్థానాలని గెలుచుకుని గోల్డ్ మెడల్ సాధించారు.ఈ ఘన విజయం సాధించిన విద్యార్థులను, విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు S. రహిమతుల్లా ను విజ్‌డమ్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ . ప్రదీప్ , అకాడమిక్ డైరెక్టర్ మదన్ మోహన్ , ప్రిన్సిపాల్ ప్రియాంక మరియు అకాడమిక్ ఇన్‌ఛార్జ్ ముఖేష్ అభినందించారు.