prajaseema.com
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 3:39 pm Digital Edition : PRAJA SEEMA

జనసేన కి మహిళా మణుల జై

యల్లటూరు శ్రీనివాసరాజు  నాయకత్వంపై విశ్వాసంతో జనసేనలో  నారపరెడ్డిపల్లి నాయకులు, మహిళలు, యువత జై కొడుతూ జాయిన్ అయ్యారు.గురువారం రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని నారపరెడ్డిపల్లి గ్రామంలో జనసేన పార్టీలో భారీ చేరికలు జరిగాయి.నారపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొంగాణి రఘు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు.రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి  యల్లటూరు శ్రీనివాసరాజు  నాయకత్వంపై, ఆయన అభివృద్ధి దృక్పథంపై, భవిష్యత్తుపై ఆయనకు ఉన్న ముందుచూపుపై సంపూర్ణ విశ్వాసంతో 150 కి పైగా కుటుంబాలు పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా రఘు యాదవ్ కి మరియు 150 కుటుంబాల ప్రజలకు, ఆయన అనుచరులకు జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జనసేన కుటుంబంలో మమేకమయ్యారు.నారపరెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు  పేర్కొన్నారు.ఈ చేరికలతో నారపరెడ్డిపల్లిలో జనసేన పార్టీకి మరింత బలం చేకూరిందని పార్టీ శ్రేణులు తెలిపారు.