prajaseema.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 11:26 am Digital Edition : PRAJA SEEMA DESK

చరిత్ర లో నిలిచిపోయేలా అమరావతి;బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు

సిద్ధవటం ప్రజా సీమ

రాష్ట్ర రాజధాని అమరావతి చరిత్రలో నిలిచిపోయేలా అసెంబ్లీలో తీర్మానం చేయడం శుభపరిణామం ని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అభివర్ణించారు సిద్ధవటం శివారులో సోమవారం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సీఎంగా పనిచేసిన జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజల మనోభావాలను గుర్తించకుండా రాజధాని మూడు ముక్కలుగా విభజించడం దారుణం అన్నారు అమరావతిని దేశంలోనే ప్రథమంగా నిలిచేలా రాజధాని అభివృద్ధి కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది బిజెపి స్వాగతిస్తుందన్నారు ఈ కార్యక్రమానికి జగన్ అసెంబ్లీకి రాకపోవడం దురదృష్టకరం రాజధాని అమరావతిని అభివృద్ధి పరచడానికి కూటమి ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగించడం అభినందనీయమన్నారు అన్ని రకాలుగా అన్ని విభాగాలు నిర్మాణాలు పనులు కొనసాగించడం చెప్పుకోదగ్గ కొనసాగిస్తుండడం చెప్పుకోదగ్గ విషయం అన్నారు రాష్ట్రంలో వలసలు లేకుండా తగిన కార్యాచరణ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించడానికి బిజెపి కార్యాచరణ ప్రణాళికను సీఎం చంద్రబాబు నాయుడు కి ఇవ్వనున్నామన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మన విజయ్ , సిద్ధవటం మండల బిజెపి అధ్యక్షుడు మంగేరి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కాకర్ల భాస్కర్ రెడ్డి, అమర్నాథ్ శర్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు, సునీత నారాయణ వర్మ, రమణారెడ్డి, జి ఎస్ రవిశంకర్ రెడ్డి, ఒంటిమిట్ట గంగిరెడ్డి, రామ్ జగదీష్, తదితరులు బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు