రాజంపేట పట్టణం- (ప్రజాసీమ)
సమస్య నా వరకు వస్తే తప్పనిసరిగా దానికి పరిష్కార మార్గం ఎంత వేగంగా ఉంటుందో రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు నిరూపించారు. గురువారం రాజంపేట పట్టణ పరిధిలోని ఈడిగ పాలెం లో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించడంలో ఆయన చూపిన వేగం మిగిలిన నాయకులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఎప్పటినుండో నీటి కష్టాలతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యను 24 గంటలు తిరగకముందే టెంకాయ కొట్టి మరి బోరు వేసే ప్రక్రియను ప్రారంభించిన తీరు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు వస్తారు, హామీలు ఇస్తారు చేసేది లేదు పాడు లేదు అని ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని చమర్తి తన చర్యలతో ప్రజలలో నమ్మకం కలిగిస్తూ రాజకీయం అంటే నటించడం కాదు సమస్యను పరిష్కరించడం అని నిరూపించారు. నిన్న తన దృష్టికి వచ్చిన సమస్య తక్షణమే స్పందించిన చమర్తి 24 గంటలు తిరగకముందే ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశంలో బోరు వేయించి తాను మాటల మనిషి కాదని చేతల మనిషిని చమర్తి జగన్ మోహన్ రాజు నిరూపించుకున్నారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లగా తాము నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని,వార్డు పర్యటనలో చమర్తి దృష్టికి తీసుకురాగా సమస్యను పరిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు.అంతేకాకుండా నీటి సమస్యను పరిష్కరించినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి,నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు కు వార్డు ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి డాక్టర్ సి సుధాకర్,పట్టణ అధ్యక్షులు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు,పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల శ్రీనివాసులు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తుపాకుల అశోక్,మున్సిపల్ కౌన్సిలర్ మీసాల వెంకటసుబ్బయ్య, పట్టణ క్లస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డయ్య నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మంద శ్రీనివాసులు,ప్రముఖ డాక్టర్ నవీన్ కుమార్,మాజీ కౌన్సిలర్లు మనుబోలు వెంకటేశ్వర్లు,మాజీ పట్టణ అధ్యక్షులు సంజీవరావు,వార్డు అధ్యక్షులు భరత్,లస్సీ బాలాజీ, శంకరాచారి, 22 వార్డ్ అధ్యక్షులు సుబ్రమణ్యం,ఎన్టీఆర్ కేశవ తదితరులు పాల్గొన్నారు.