సిద్ధవటం (ప్రజా సీమ )
తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజంపేట నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సిద్ధవటం మండల తెలుగు తమ్ముళ్లుకు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు చేతుల మీదుగా చిరు సన్మానం రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ నాగూర్ వీరభద్రుడు , సిద్ధవటం సింగల్ విండో చైర్మన్ దారపునేని దశరథ రామానాయుడు, శ్రీ నిత్య పూజ స్వామి దేవస్థానం చైర్మన్ జంగిటి రాజేంద్ర ప్రసాద్ యాదవ్, మాధవరం గ్రామ సభ్యులు పెగడ హరి ప్రసాద్ ల ను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని, సామాన్య కార్యకర్తలను కూడా గొప్ప నాయకులుగా తీర్చిదిద్దగల పార్టీ అని, అటువంటి పార్టీలో సామాన్య కార్యకర్తలుగా ఉన్న తమకు సముచిత గౌరవం అందించి వివిధ పదవులను కేటాయించి తనకు అన్ని విధాలా సహకరిస్తున్న తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని వారు తెలియజేశారు.