prajaseema.com
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 5:18 pm Digital Edition : PRAJA SEEMA

గురుపౌర్ణమి రోజున సాయిబాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 

గురుపౌర్ణమి రోజున సాయిబాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్
రైల్వేకోడూరు  న్యూస్
ఓబులవారిపల్లె మండలం వైకోట గ్రామంలోని కోటారు వీధిలో ఉన్న  సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి శుభ సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయిబాబా ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్  గ్రామ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కి స్వాగతం పలికి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.