గాలివీడు మార్చి 16(ప్రజా సీమ విలేకరి)
గాలివీడు మండలంలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు మండల విద్యాశాఖ అధికారులు మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు సౌకర్యంగా పరీక్షలు రాయేందుకు గాలివీడు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ మరియు జడ్పీహెచ్ఎస్ ఉర్దూ హై స్కూల్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.
మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ మూడు కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతున్నారు. జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ కేంద్రంలో 230 మంది, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్ కేంద్రంలో 240 మంది, జడ్పీహెచ్ఎస్ ఉర్దూ హై స్కూల్ కేంద్రంలో 150 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 620 మంది విద్యార్థులు గాలివీడు మండలంలోని ఈ కేంద్రాల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారు.
పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు మండల విద్యాశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణను కట్టుదిట్టం చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.