వేంపల్లె నేటి పత్రిక ప్రజాసీమ:
ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో ముందుకెళ్లి, మంచి విద్యను అభ్యసించాలని, విజయాలను సొంతం చేసుకోవాలని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అన్నారు. శనివారం పియూసి-1 విధ్యార్థులకు యూనిఫాం లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యా అందించేందుకు ఆర్జియూకేటీ క్యాంపస్ లను ఏర్పాటు చేసిందన్నారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, జీవితాన్ని మెరుగైన దిశగా అడుగులు వేయాలని, సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చదువుల్లో రానించి తల్లిదండ్రులకు, క్యాంపస్ కీ మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి రవికుమార్, అకాడమిక్ డీన్ రమేష్ కైలాస్, స్టూడెంట్ వెల్ఫేర్ వెంకటేష్, సుధాకర్ రెడ్డి, బిన్నీ తదితరులు పాల్గొన్నారు.