prajaseema.com
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 6:18 pm Digital Edition : PRAJA SEEMA

కోవర్టుల భరతం పడితే టిడిపి విజయం తథ్యం

రాజంపేట (ప్రజా సీమ) కోవర్టుల భరతం పడితేనే టిడిపి రాజంపేట నియోజకవర్గంలో మరింత బలోపేతం అవుతుందని, రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు టిడిపిని బలోపేతం చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంటే కొందరు కోవర్టులు ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి కుట్రలు పన్నుతున్నారని టిడిపి సీనియర్ నాయకులు, కడప జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు శివ నారాయణ చౌదరి తెలియజేశారు. బుధవారం అమరావతి నందు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని శివనారాయణ చౌదరి మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా శివనారాయణ చౌదరి రాష్ట్ర అధ్యక్షులతో రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ వ్యవహారాల గురించి వివరించడం జరిగింది.రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జగన్మోహన్ రాజు నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతున్నదని, రాబోవు స్థానిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా జరగబోయే ఏ ఎన్నిక అయినా వందకు వంద శాతం కూటమి అభ్యర్ధులను గెలిపించుకునే విధంగా టీడీపీ ఇంచార్జి జగన్మోహన్ రాజు కృషి చేస్తున్నారని, కానీ కొంత మంది పార్టీలో కోవర్టులుగా మారి పార్టీ బలహీన ఆడేలా చేస్తున్నారని,పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేసిన వైసీపీ వాళ్ళు పార్టీలోకి వస్తున్నారని ఇలాంటి వారితో పార్టీకి ఇబ్బందికలుగుతుందని వివరించారు. అలాగే నిత్యం పార్టీ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవాలని, రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని, గతంతో పోల్చుకుంటే నాయకులు కార్యకర్తలు ఏకతాటిపైకి వస్తున్నారని, ఇలాంటి సమయంలో తిరిగి ప్రతిపక్ష పార్టీలకు రద్దుచేకూర్చేలా కొందరు వ్యక్తులు కోవర్టులుగా మారి కుట్రలు పొందుతూ పార్టీని రాజంపేటలో ఎదగకుండా చేసేందుకు పనిచేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని అధిష్టానం ముందుకు వెళితే రాజంపేటలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని ఆయన పల్లాకు వివరించారు. ఈ విషయమై
రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్పందిస్తూ ఈ వ్యవహారాలు అన్నీ మాకు తెలుసుననీ, కోవర్టులు కొందరు ఇతర పార్టీ వారిని ప్రోత్సహిస్తున్నారని వాటి పై పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని,అలాంటి వారిని ప్రోత్సహించబోమని, రాజంపేట నియోజకవర్గం లో ప్రతి టిడిపి నాయకుడు కార్యకర్త టీడీపీ ఇంచార్జి జగన్మోహన్ రాజు తో కలిసి పనిచేయాలని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జెండా రాజంపేట నియోజకవర్గంలో రెపరెపలాడించి అధిష్టానానికి కానుకగా ఇవ్వాలని ఆయన సూచించారనీ తెలిపారు.