prajaseema.com
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 6:01 pm Digital Edition : PRAJA SEEMA

కోడూరు పట్టణ పరిధిలో గంజాయి కేసులలో పాత నేరస్తులకు కౌన్సెలింగ్

కోడూరు పట్టణ పరిధిలో గంజాయి కేసులలో పాత నేరస్తులకు కౌన్సెలింగ్

రైల్వేకోడూరు న్యూస్

తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట సబ్-డివిజన్ డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసుల్లో గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, రైల్వే కోడూరు ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా గంజాయి విక్రయం, రవాణా, నిల్వ మరియు వినియోగం చట్టరీత్యా శిక్షార్హమైన నేరాలని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గంజాయి వ్యాపారం వల్ల యువత భవిష్యత్తు, కుటుంబాలు మరియు సమాజం తీవ్రంగా నష్టపోతాయని వివరించి, ఇటువంటి అక్రమ కార్యకలాపాలను వెంటనే పూర్తిగా విరమించాలని సూచించారు. భవిష్యత్తులో మళ్లీ గంజాయి సంబంధిత నేరాలలో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే నిర్బంధ చర్యలు కూడా చేపడతామని స్పష్టం చేశారు.మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.