ఆంధ్రప్రదేశ్-మార్కాపురం జిల్లా (ప్రజా సీమ)
మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో 10 మంది సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారన్న దాని స్పష్టత రావల్సి ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు.