కార్మిక నేతలు నాగిపోగు పెంచలయ్య, సురేంద్ర ఏఐటీయూసీ లోకి చేరిక
రైల్వే కోడూరు న్యూస్
రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఓబులవారిపల్లి ప్రాంతంలో కార్మిక నాయకుడిగా గుర్తింపు పొందిన నాగిపోగు పెంచలయ్య సురేంద్ర నాయకత్వంలో కొంతమంది ఏఐటీయూసీలో చేరిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఏఐటియుసి రైల్వే కోడూరు నియోజకవర్గ అధ్యక్షులు గంగాధర్ అధ్యక్షత వహించగా పోకూరు మురళి నేతృత్వంలో వారిని ఏఐటీయూసీ లోకి స్వాగతం పలికారని ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి దాసరి జయచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు
వారు గతంలో ఓ కేంద్ర కార్మిక సంఘంలో మండల కార్యదర్శిగా పనిచేశారని గత 20 సంవత్సరాల కాలంగా ఆ సంఘంలో పనిచేస్తూ అనేక కార్మిక సంఘాల నిర్మాణం అనేక కార్మిక సమస్యల పైన పోరాటం చేశారని అయితే ఈ మధ్యకాలంలో ఆ సంఘం కార్మికుల వద్దకు వెళ్లడం లేదని కార్మిక సమస్యలపై పనిచేయటం లేదని భావించి నేను ఆ సంఘానికి రాజీనామా చేశానని రైల్వే కోడూరు నియోజకవర్గంలో కార్మిక సమస్యల్ని పట్టించుకోవడంలో కార్మిక సమస్యలు పరిష్కరించుకోవడంలో చాలా కాలంగా ఏఐటియుసి విశేషమైన కృషి చేస్తుందని ఆ కృషికి నేను ఆకర్షితుడైనై ఈ సంఘంలో పనిచేయాలనుకుని ఏఐటీయూసీ నాయకత్వాన్ని కోరానని వారు సాదరంగా నన్ను స్వాగతం పలికాలని అందుకు ఏఐటియుసి నియోజకవర్గ మరియు జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వారు తెలియజేశారు.
ఏ ఐ టి యు సి నాయకత్వం నాకు ఇచ్చే బాధ్యతల ప్రకారం నేను ఓబులవారిపల్లె మండలంలోని మరియు రైల్వే కోడూరు నియోజకవర్గంలో పనిచేయటానికి కార్మిక సమస్యల పరిష్కారంలో ఏఐటీయూసీ నాయకత్వంతో కలిసి పనిచేస్తానని నా నాయకత్వంలో ఉన్న కొన్ని సంఘాలను కూడా ఏఐటీయూసీకి అనుబంధంగా మారుస్తానని వారు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య ఏఐటియుసి నాయకులు దినేష్ సరోజమ్మ రత్నమ్మ జయరాం నాగమ్మ. సుబ్బమ్మ రమణ, బత్తల హరి మణికంఠ సాయి రసూల్, విజయ కృష్ణ, నరసింహ,రామచంద్రయ్య, మనోజ్, బాలు బాషా నరసింహులు, సురేష్ బాబు, నాదర్ వల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.