prajaseema.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 2:47 pm Digital Edition : PRAJA SEEMA

ఒత్తిడి లేని చదువులు కావాలి- బీటీఏ

రాయచోటి ఫిబ్రవరి 11(ప్రజాసీమ): పబ్లిక్ పరీక్షల పేరుతో పదవ తరగతి విద్యార్థుల పైన ఒత్తిడి ని తగ్గించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పల్లం రామచంద్ర అన్నారు. రాయచోటిలోని కొత్తపేట బీటీఏ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఒత్తిడి లేని చదువులు అందించాలని పబ్లిక్ పరీక్షలు పేరుతో వారి పైన ఒత్తిడి తీసుకురాకూడదని వచ్చే విద్యా సంవత్సరం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక బదులుగా 200 రోజుల కార్యాచరణ ప్రణాళికను పదవ తరగతి విద్యార్థులకు విద్యాసంవత్సర ప్రారంభదశ నుండే అమలు చేయాలన్నారు. అందులో ప్రయోగశాల కృత్యాలు, క్షేత్ర పర్యటనలు, విహార యాత్రలు, ఉండాలన్నారు. ప్రతి పాఠ్యాంశము పూర్తైన తర్వాత పరీక్షలు నిర్వహించి విద్యార్థులలో భయాన్ని పోగొట్టాలన్నారు. పాఠశాల ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు ప్రయోగశాల కృత్యాలకు అవసరమైనటువంటి సామాగ్రిని ప్రతి పాఠశాలకు తప్పకుండా అందించాలన్నారు. విద్యార్థుల మానసికోల్లాసానికి అవసరమైన క్షేత్ర పర్యటనలు విహారయాత్రాలను విద్యా ప్రణాళికలో భాగం చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో బీటీఏ నాయకులు మదన్ మోహన్ నాయక్,శ్రీరాములు నాయక్ పాల్గొన్నారు.