prajaseema.com
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 8:44 am Digital Edition : PRAJA SEEMA DESK

ఒంటిమిట్ట రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చమర్తి దంపతులు

ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరామ స్వామికి శ్రీరామనవమి సందర్భంగా రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రలను సమర్పించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆలయ మర్యాదలతో వేదమంత్రాలు మధ్య ఆయన సతీసమేతంగా పట్టు వస్త్రాలను తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారిని సాదరంగా స్వాగతించి కోదండ రామస్వామి బ్రహ్మోత్సవ వేడుకలను ఆరంభించారు. ఈ సందర్భంగా రాజంపేట ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి దక్కని అదృష్టం రాజంపేట నియోజకవర్గ ప్రజలకు దక్కిందని, చరిత్రలో ఒకరికి మంచి చేయాలన్నా మంచి చూపాలన్న మంచి గురించి మాట్లాడాలి అన్న వచ్చే ఒకే ఒక దైవం పేరు కోదండ రాముడని, అటువంటి కోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమని, అలాగే ఈ ప్రాంతంలో జన్మించిన ప్రతి ఒక్కరూ స్వామి వారి కృపతో అదృష్టం పొందారని, భవిష్యత్తులో ఒంటిమిట్టను ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తాము  కూడా భాగస్వాములమవుతామని, ఒంటిమిట్టలో జరిగే కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలను ప్రతి ఒక్కరు తిలకించి పునీతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.