ఒంటిమిట్ట-(ప్రజా సీమ)
ఆంధ్ర భద్రాద్రి ఏకశిలా నగరం ఒంటిమిట్టలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కోదండరామ స్వామి నీ దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్టకు వచ్చే ప్రతి భక్తునికి స్వామి వారం దర్శనం కలిగేలా టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్ల ద్వారా భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే క్యూలైన్లో వచ్చే భక్తులకు వాటర్ బాటిల్ లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తూ ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ దర్శనం కలిగేలా చర్యలు అధికారులు చేపడుతున్నారు. భారీ బందోబస్తు మధ్య ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తూ శ్రీ రామ వేడుకలను సాంప్రదాయబద్ధంగా భక్తులకు కన్నుల పండుగ కలిగేలా దేవదాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు తనివి తీర స్వామివారిని దర్శించుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.