01-04-2026 బుధవారం నాడు గంగా హారతి మరియు గిరి ప్రదక్షిణ సాయంత్రం 6:00 గంటలకు మొదలవుతుంది. ఉగాది తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి సందర్బంగా త్రేతేశ్వరునికి గిరి ప్రదక్షిణ చేయడం జన్మ జన్మల పుణ్యఫలం అందులోనూ నూతన సంవత్సరం కావున గిరిప్రదక్షిణ చేయడం మహా పుణ్య కార్యక్రమం కావున విషయాన్ని మీకు తెలిసిన వారికి తెలిపి మీతో పాటు వారిని కూడా గిరి ప్రదక్షిణ చేపించగలరనీ ఆలయ నిర్వహకులు తెలియజేశారు.పరమేశ్వరుని ఆశీస్సులతో పుత్తన లలితమ్మ వారి కుమారుడు పుత్తన శ్రీనివాసులు రెడ్డి ఏప్రిల్ నెలలో గంగా హారతి సాంగ్యంతో పాటు హాజరయ్యే భక్తులకు అన్నప్రసాద వితరణ మరియు చల్లటి మంచి నీళ్లు ఏర్పాటు చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి కృపా కటాక్షములు అందాలని కోరుకుంటున్నామనీ,ప్రతి గిరి ప్రదక్షిణ అనంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు ఇబ్బంది పడకుండా చెర్రీస్ స్కూల్ యాజమాన్యం బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారన్నారనీ శ్రీ శ్రీ శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ భక్త మండలి కమిటీ వారు తెలియజేశారు.