ఓబులవారిపల్లి:( ప్రజా సీమ)
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట ఏపిఎండిసి క్యాంప్ ఆఫీస్ నందు ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో గుంతకల్లు రైల్వే డిఆర్సిసి సభ్యులు, రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం భరత్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, స్వామివారి దయతో అందరికీ మంచి జరగాలని, మంచికి మాటకి విలువ నిచ్చే కోదండరాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.