prajaseema.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 7:47 pm Digital Edition : PRAJA SEEMA DESK

ఏపీలో చెత్తతో బయో గ్యాస్.. 5 ప్లాంట్ల ఏర్పాటు*

 

అమరావతి :

ఏపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల ఘన వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, ఒంగోలులో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు, విజయవాడ ప్లాంట్ అప్ గ్రేడ్ కు రూ.59.85 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో ప్లాంట్ రోజుకు 25 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈనిర్ణయం వల్ల నగరాల్లో వ్యర్థాల సమస్య తగ్గడమే కాకుండా పర్యావరణహిత ఇంధనం అందుబాటులోకి రానుంది.