prajaseema.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 11:47 pm Digital Edition : PRAJA SEEMA DESK

ఉషోదయ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

పాఠశాల ఆఖరి రోజు సందర్భంగా రాజంపేట లోని ఉషోదయ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు విద్యార్థులకు మెడల్స్ తో పాటు సర్టిఫికెట్లను కూడా అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ కుమార్, డైరెక్టర్ మానస మాట్లాడుతూ నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు ఉషోదయ పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నామని, ఆఖరి రోజు ప్రతి విద్యార్థికి ప్రత్యేక మెడల్ తో పాటు సర్టిఫికెట్ అందజేయడం చాలా ఆనందంగా ఉందని, అన్ని వసతులతో ఆహ్లాదకర వాతావరణంలో తరగతి గదులు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని వసతుల కల్పనతో మెరుగైన విద్యను అందిస్తామని వారు తెలియజేశారు.