prajaseema.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 1:42 pm Digital Edition : PRAJA SEEMA

ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం. అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి.

 

ఎన్టీఆర్ జిల్లా (మైలవరం)
రెడ్డి సేవా సంఘం మైలవరం వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించటం అభినందనీయమని వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

రెడ్డి సేవా సంఘం మైలవరం వారి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వివేకానంద స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరాన్ని సందర్శించిన కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేదవారికి కూడా కార్పోరేట్ వైద్యం అందాలనే ఉద్దేశంతో కార్పోరేట్ హాస్పటల్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు రెడ్డి సేవా సంఘం మైలవరం వారిని అభినందించారు.