prajaseema.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 12:24 pm Digital Edition : PRAJA SEEMA DESK

ఈ సారి ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ

అమరావతి

నేటి పత్రిక ప్రజాసీమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ లబ్దిదారులకు కేంద్రం శుభవార్త అందించనున్నట్లు సమాచారం.

ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత రేషన్ ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు రాష్ట్రాలకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఈ మార్చి నెలాఖరులోపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఎండల తీవ్రతతో పాటు గోదాముల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.