prajaseema.com
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 11:21 am Digital Edition : PRAJA SEEMA DESK

ఈ నెల 16 న ఉచిత కంటి వైద్య శిబిరం

రాజంపేట(ప్రజా సీమ)

ఆరోగ్య రాజంపేట లక్ష్యంగా ఈ నెల 16 న రాజంపేట పట్టణం లోని ఏబీ చంద్రా రెడ్డి గార్డెన్ లో రేడియంట్ వరల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు.గురువారం ఆయన పాత్రికేయుల సమావేశంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట ను ఆరోగ్య రాజంపేట గా మార్చేందుకు విడతల వారిగా ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని,అందులో భాగంగా 16 వ తేదీ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని,రాజంపేట నియోజక వర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని,అలాగే వైద్య శిబిరం వద్దే భోజన ఏర్పాట్లు చేశామని,సుదూర ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలియజేశారు.అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు మంచి చేస్తుందని,అందులో ఎటువంటి అవకతవకలు ఉంటే చర్యలు తప్పవని ఆయన మరో సారి తెలియజేశారు.