రాజంపేట-(ప్రజా సీమ)
రాజంపేట పట్టణం ఆర్ఎస్ రోడ్డు లో నూతనంగా వెలసిన ఆ షాపింగ్ మాల్ పై అధికారుల ప్రేమ అంతెందుకు ఉంది అని పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా రోడ్డును ఆక్రమించి బారికేడ్లను కూడా రోడ్డుపైన ఏర్పాటు చేసుకొని, మారికేట్ల తర్వాత ఆటోలు నిలుపుతుండడంతో సగం రోడ్డు ఈ షాపింగ్ మాల్ కే సరిపోతుంది. రాజంపేటలో నూతనంగా ప్రారంభమైన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ దెబ్బకు ఆర్ఎస్ రోడ్డులో చాలావరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. సాయంత్రం వేళలో అయితే విపరీతమైన ట్రాఫిక్ జామ్ కు ఈ షాపింగ్ మాల్ కేంద్ర బిందువు అవుతుంది. మరి ఈ షాపింగ్ మాల్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైనే బారికేడ్లు ఉంచి ప్రజలను ఇబ్బందులు పెడుతూ వ్యాపారాలను కొనసాగిస్తుంటే వాటిని సరి చయాల్సిన అధికారులు మాత్రం చుట్టుపక్కల పార్కింగ్ స్థలం లేక ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తున్న వాహనదారుల పై జరిమానాల మోత మోగిస్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని కలిగించే పనిలోపడ్డారు. మరి ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తున్న ఈ షాపింగ్ మాల్ కు సంబంధించి నిబంధనల మేర రోడ్డుపై ఉన్న భారీ గేట్లను షాపింగ్ మాల్ లోపల వారి హద్దులలో ఉంచి, ఈ ప్రదేశంలో ఆటోలు ఇతర వాహనాలు రోడ్డుపై పార్కింగ్ లేకుండా చర్యలు తీసుకుంటే రాజంపేట ఆర్ఎస్ రోడ్ లో ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి. మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు చర్యలు తీసుకునేందుకు ఎందుకు ఇష్టపడడం లేదో, ఈ షాపింగ్ మాల్ పై అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఏదైనా షాప్ పక్కన ఒక వాహనం నిలబెడితే వెంటనే జరిమానా విధించే అధికారులు మరి రోడ్డుపైనే బారికేడ్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే అది ప్రత్యేక ప్రేమ అనే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని పలువురు కోరుతున్నారు.