ఆర్.సి. సురేష్‌బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దార్ల చంద్రశేఖర్
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
రైల్వేకోడూరు మండలం స్థానిక సీనియర్ అడ్వకేట్, ఏపీఎండీసీ మాజీ లీగల్ అడ్వైజర్, మాజీ సర్పంచ్ ఆర్.సి. సురేష్‌బాబు జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, నాయకులు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బుడుగుంటపల్లి సర్పంచ్, రిటైర్డ్ తహసీల్దార్ దార్ల చంద్రశేఖర్, వైసీపీ నాయకులు సూర్య ప్రకాష్ సురేష్‌బాబును కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
న్యాయవాదిగా, ఏపీఎండీసీ మాజీ లీగల్ అడ్వైజర్‌గా, మాజీ సర్పంచ్‌గా ఆర్.సి. సురేష్‌బాబు అందించిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ప్రజా సేవలో ఆయన మరింత ముందుకు సాగాలని శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సురేష్‌బాబు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు తదితరులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.