prajaseema.com
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 10:21 pm Digital Edition : PRAJA SEEMA

ఆపరేషన్ త్రిశూల్ – అవగాహన కార్యక్రమం

ఆపరేషన్ త్రిశూల్ – అవగాహన కార్యక్రమం

రైల్వేకోడూరు ప్రజా సీమ

తిరుపతి జిల్లా ఎస్పీ . సుబ్బరాయుడు, ఐపీఎస్  ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ  వై. శ్రీనివాసరావు  పర్యవేక్షణలో, రైల్వే కోడూరు టౌన్ సీఐ  చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో సెట్టిగుంటలో “ఆపరేషన్ త్రిశూల్” అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రజలకు మూడు ప్రధాన అంశాలపై అవగాహన కల్పించారు: జీరో డ్రగ్స్ – మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం.

మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ – మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు నేరాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించడం.

జీరో రోడ్ యాక్సిడెంట్స్ – ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, సురక్షితంగా వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడం.ప్రజలు పోలీసులకు సహకరించి డ్రగ్స్ రహిత, మహిళలకు సురక్షితమైన, ప్రమాద రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పోలీసులు కోరారు.