ఆత్మహత్య యత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన రైల్వే కోడూరు పోలీసులు
రైల్వేకోడూరు ప్రజా సీమ
డయల్-100కు వచ్చిన సమాచారం మేరకు స్పందించి మహిళను రక్షించిన రైల్వే కోడూరు పట్టణ పోలీసులు
రైల్వే కోడూరు పట్టణంలోని బైపాస్ రోడ్డుకు చెందిన షేక్ సారా, వయస్సు 22 సంవత్సరాలు, భర్త పేరు సల్మా, ఒక బాబు సంతానం కలదు. కుటుంబ సమస్యల కారణంగా రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు డయల్-100 ద్వారా సమాచారం అందింది.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే కోడూరు పట్టణ పోలీస్ సిబ్బంది సత్వరమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని, సారా రైలుకింద పడకుండా సకాలంలో రక్షించారు. అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, వారి సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే డయల్-100/112కు సమాచారం అందించాలని రైల్వే కోడూరు పోలీసులు సూచించారు.