ఆటో ఓనర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
రైల్వేకోడూరు ప్రజాసేవ
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం రైల్వేకోడూరు ఆటో ఓనర్స్ వర్కర్స్ యూనియన్ తరపున స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఆటో యూనియన్ ఆటలతో రైల్వే స్టేషన్ నుండి టోల్గేట్ వరకు అక్కడి నుండి ఆటో కార్మికులందరూ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందని యూనియన్ గౌరవాధ్యక్షులు బత్తిన గంగయ్య యాదవ్ తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో బత్తిన గంగయ్య యాదవ్ గౌరవ అధ్యక్షులు, సలహాదారుడు ఉదయ్ కుమార్ ,యూనియన్ లీడర్ కొత్త సిద్దేశ్వర ,ట్రెజరీ వెంకటేష్ ,సెకండ్ లీడర్ పసుపులేటి బాలాజీ ,సెక్రెటరీ నరసింహనాయుడు తదితర ఆటో యూనియన్ సభ్యులు అందరూ కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగినది.