prajaseema.com
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 2:04 pm Digital Edition : PRAJA SEEMA

ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎలమంజుల బాలాజీ కి ఘన సన్మానం

విజయవాడ:, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎలమంజుల బాలాజీని ఎం. సోలమన్ రాజు, బుచ్చిగారి కిరణ్ తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.

ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలమంజుల బాలాజీని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన న్యాయవాదులు, ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంక్షేమం, న్యాయవృత్తి అభివృద్ధి, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.న్యాయవాదుల హక్కుల పరిరక్షణతో పాటు జూనియర్ న్యాయవాదుల అభ్యున్నతికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎం. సోలమన్ రాజు, బుచ్చిగారి కిరణ్‌తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.