రాజంపేట(ప్రజా సీమ)
అమరావతి రాజధాని కావడం ఆంధ్రరాష్ట్రానికి శుభ పరిణామం, రాష్ట్ర రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా అవ్వడం ఆంధ్ర రాష్ట్రానికి శుభ పరిణామం, రాష్ట్ర భవిష్యత్ ప్రదాత ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు సారధ్యంలో అమరావతి రాజధాని ఒక చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు సిద్దారపు రామ్మోహన్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర రాజధానులు మూడు చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధాని కావడం తో నిరుద్యోగ యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరే ఇలాంటివిజినరి కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . ఇంకా 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము అని అన్నారు అలాగే రాజంపేటలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేట పట్టణం మరియు నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉండడం శుభపరిణామం అన్నారు. చమర్తి జగన్మోహన్ రాజు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారం మార్గాలు చూపుతూ ఊరు వాడ పల్లె బాట పట్టి అందరి కుటుంబాలలో తను ఒక కుటుంబ సభ్యులుగా మెలుగుతూ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ. రాజంపేట నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తున్న జగన్మోహన్ రాజు కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు సిద్దారపు రామ్మోహన్ తెలియజేశారు.