అగ్రహారంలో తాగునీటి ఎద్దడి: స్పందించి మరమ్మతులు చేయించిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి
రైల్వేకోడూరు ప్రజా సీమ
తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం, మంగంపేట పంచాయతీ పరిధిలోని అగ్రహారం ఆర్ఆర్2 కాలనీలో గత వారం రోజులుగా మంచినీటి ప్లాంట్ పనిచేయక పోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గమనించిన గ్రామ ప్రజలు రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన భరత్ కుమార్ రెడ్డి, అగ్రహారంలోని వాటర్ ప్లాంట్‌ను స్వయంగా సందర్శించి పరిశీలించారు. అనంతరం సమస్య తీవ్రతను ఏపీఎండిసి చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గోపీనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్థుల తాగునీటి తిప్పలను వివరిస్తూ, వెంటనే ప్లాంట్ మరమ్మతులు పూర్తి చేయించి మంచినీటి సౌకర్యాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఏపీఎండిసి సిపిఓ గోపీనాథ్ సానుకూలంగా స్పందించారు. వెంటనే వాటర్ ప్లాంట్‌కు సంబంధించి కావాల్సిన మరమ్మతు పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యపై తక్షణమే స్పందించి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన తల్లెం భరత్ కుమార్ రెడ్డికి మరియు అధికారులకు స్థానిక అగ్రహారం గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.