రాయచోటి మార్చి 16(ప్రజా సీమ ప్రతినిధి)
అక్రీడియేషన్ అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు పట్టణంలోని పలువురు పాత్రికేయులు తమకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని మంత్రివర్యులను కోరారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రివర్యులు వెంటనే తహసిల్దార్ తో మాట్లాడి రాయచోటి పట్టణంలో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేయించాలని ఆయనను కోరారు.మీడియా ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రజలకు సమాచారాన్ని నిజాయితీగా బాధ్యతాయుతంగా అందించడంలో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.