prajaseema.com
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 5:03 pm Digital Edition : PRAJA SEEMA

అంగన్‌వాడీ ఉత్సవాలు కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా సెక్రటరీ కుప్పాల జ్యోతి 

అంగన్‌వాడీ ఉత్సవాలు కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా సెక్రటరీ కుప్పాల జ్యోతి

రైల్వేకోడూరు ప్రజా సీమ

127-SC తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు మండల పరిధిలోని కె-బుడుగుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలలో ఈరోజు అంగన్‌వాడీ ఉత్సవాలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ నిర్మలా దేవి , సిడిపిఓ రేణుకా ,అంగన్‌వాడీ టీచర్ రాజమ్మ , అంగన్‌వాడీ హెల్పర్ లు, ఆరోగ్య కార్యకర్తలు మరియు మహిళా మోర్చా జిల్లా సెక్రటరీ కుప్పాల జ్యోతి తో పాటు మండల అధ్యక్షులు సాయం శ్రీధర్ , ప్రధాన కార్యదర్శులు కాళప్పగారి రాము, కుప్పాల కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు ఉమా మహేశ్వర రెడ్డి , యువ మోర్చా జిల్లా సెక్రటరీ సాయి ఆచారి,పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో అందిస్తున్న పోషకాహార సేవలు, ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలు, గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలును పరిశీలించడం జరిగింది.

కేంద్రం ద్వారా అందుతున్న ఆహార పదార్థాలు సకాలంలో అందుతున్నాయని, తమ పిల్లల ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

అంగన్‌వాడీ సేవలను అంకితభావంతో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది మరియు ఆరోగ్య కార్యకర్తలను ఈ సందర్భంగా సన్మానించి అభినందించడం జరిగింది.