prajaseema.com
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 3:44 pm Digital Edition : PRAJA SEEMA

అంగన్వాడి ఉత్సవం మరియు ‘పోషణ్ మా’ కార్యక్రమo

 

అంగన్వాడి ఉత్సవం మరియు ‘పోషణ్ మా’ కార్యక్రమo

రైల్వేకోడూరు ప్రజా సీమ

రైల్వేకోడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కోడూరు సెక్టర్ లక్ష్మీ నగరం ఏ డబ్ల్యూ సి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడి ఉత్సవం మరియు ‘పోషణ్ మా’ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లులు,చిన్నారులకు పోషకాహార ప్రాముఖ్యతపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ పిల్లలలో పోషకాహార లోపాలను నివారించడానికి, ఆరోగ్యకరమైన ఎదుగుదల సాధించడానికి రోజువారీ ఆహారంలో వివిధ రకాల ఆహార వర్గాలను చేర్చుకుంటూ సమతుల్యాహారం అందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వై నిర్మలాదేవి విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ సపోర్ట్టెడ్ బై టాటా ట్రస్ట్ ప్రోగ్రామ్ అసోసియేట్ జి పద్మశ్రీ , అంగన్వాడీ టీచర్ కే వెన్నెల, చిన్నారులు మరియు తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.